సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలలో నేడు, గురువారం ఉదయం ఏలూరులో అధికారుల సమక్షంలో జరిగిన ఓట్ల కౌంటింగ్ లో ఇద్దరు వైసిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. – స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు కవురు శ్రీనివాస్ 481 ఓట్లతో, వంకా రవీంద్రనాధ్ 460 ఓట్లతో 2 స్థానాల్లో విజయం సాధించారు. వీరిరువురు మొదటి ప్రాధాన్యత ఓటు తోనే విజయం సాధించారు. ఇక తెలుగుదేశం పార్టీ మద్దతు తో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్ర శేఖర్ కు 120 ఓట్లు వచ్చినట్లు సమాచారం.. విజయం సాధించిన భీమవరం నియోజక వర్గానికి చెందిన , ప్రస్తుత జిల్లా పరిషత్తు చైర్మెన్, కవురు శ్రీనివాస్ కు, తణుకు పట్టణానికి చెందిన వంకా రవీందర్లకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తో పాటు జిల్లా వ్యాప్తంగా వైసిపి ప్రముఖులు అభినందనలు తెలిపారు.
