సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భీమవరం నియోజకవర్గానికి చెందిన కవురు శ్రీనివాస్,ప్రభుత్వ విఫ్, నరసాపురం ఎమ్మెల్యే, ప్రసాదరాజు తో కలసి ఈ రోజు సాయంత్రం విజయవాడ లోని శాసనమండలి చైర్మన్ వారి క్యాంపు కార్యాలయంలో శాసనమండలి ఛైర్మన్ , కొయ్యే మోషేను రాజు ని మర్యాద పూర్వకంగా కలిశారు.( ఆయన కూడా భీమవరం వాసి కావడం గమనార్హం ) ప్రస్తుత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్తు చైర్మెన్ గా పనిచేస్తున్న కవురు శ్రీనివాస్ కు సీఎం జగన్ ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి మరో మెట్టు పైకి ఎక్కించి గౌరవించారని ఆ పదవిలోకూడా తన సమర్ధత ను నిరూపించుకోవాలని ఆసిర్వదిస్తు..చైర్మెన్ మోషేను రాజు ,శ్రీనివాస్ కి స్వీట్ తినిపించి అభినందనలు తెలిపారు
