సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని ఎంపీ అవినాశ్ రెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ తదుపరి కోర్టు కొట్టేసింది. తన విచారణపై స్టే ఇవ్వాలని అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో అవినాష్‌కు తీవ్ర నిరాశ ఎదురయ్యింది. సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి హైకోర్టు ఆదేశాలివ్వడం గమనార్హం. అరెస్ట్ చేయొద్దని తాము చెప్పలేమని అవినాష్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
