సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి వ్యాప్తంగా నేడు, శుక్రవారం ఉదయం భారీ వర్షాలు కురియడం జరిగింది. భీమవరం లో అయితే నిన్న గురువారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతం అయ్యింది. నేటి ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఒక మోస్తరు వర్షం కురిసింది. ఇంటర్ పరీక్షలకు హాజరు అయ్యే విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది అయ్యింది. పట్టణంలో అసలే వైరల్ జ్వరాలు తో బాధపడుతున్న రోగులకు మరింత ఇబ్బంది కలిగింది,వివరాలలోకి వెళ్ళితే .. పశ్చిమ బెంగాల్‌ నుంచి జార్ఖండ్‌ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ ఒకటి, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ వరకు మరొకటి ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి దక్షిణ, తూర్పు, ఈశాన్య భారతం వైపునకు తేమగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఈ వేసవి కాలంలో సముద్రం నుంచి తేమగాలుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నందున కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నెల 19 వరకు, రాయలసీమలో అనేకచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీయనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *