సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకపక్ష విజయాలు నమోదు చేసిన అధికార వైసిపి అబ్యరులు ఇప్పడు ఏపీ లో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు నేటి శుక్రవారం ఓట్ల లెక్కింపు లో మాత్రం పోటీ ఎదుర్కొంటున్నారు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసిపి అభ్యర్థులు విజయం సాధిస్తూ అందరిని షాక్ గురిచేయ్యగా.. డిగ్రీ చదివిన పట్టభద్రుల స్థానాల్లో మాత్రం హోరాహోరీ పోరు నడుస్తోంది. అధికార వైసిపి సర్కార్ కు కొంత షాక్ కు గురిచేసే అంశంగానే గుర్తించాలి.ఉత్తరాంధ్ర, తూర్పు రాయల సీమల్లో టీడీపీ ఆధిక్యంలో ఉండగా.. పశ్చిమసీమ స్థానంలో వైసీపీ స్వల్ప మెజారిటీతో ఉంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. వరుసగా నాలుగు రౌండ్లలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఆరో రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం నాలుగు రౌండ్లు కలిపి చిరంజీవి రావుకు 16981 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *