సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లోజిల్లా కేంద్రం భీమవరం లో తెలుగుదేశం రాజకీయాలు రచ్చ రచ్చగా మారాయి. ఇటీవల ఆ పార్టీ పట్టణాధ్యక్ష పదవికి ఇందుకూరి సుబ్రమణ్యరాజు ను పట్టణ అడ్జక్షునిగా నియమించడంపై..నేపథ్యంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు, భీమవరం నియోజ కవర్గం ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మిని ఏకపక్ష ,నియంతృత్వ నిర్ణయాలును ఇకపై సహించమని ఆమెపై తెలుగు తమ్ముళ్ళు తిరుగుబాటు చేసారు, గత కొద్దీ రోజులుగా సీనియర్ నేత మెంటెపార్ధసారధి వివాదాన్ని పరిష్కరించాడనికి చేసిన కృషి ఫలించలేదు, ఇక్కడి క్యాడర్ సమస్యల్ను పార్టీ అధిష్టానం ..అచ్చేమ్ నాయుడు దృష్టికి తీసుకొనివెళ్ళటంపై కూడా ఇక్కడ పార్టీ పెద్దలకు నచ్చటంలేదని కొందరు మాజీ కౌన్సెలర్స్ వాపోతున్నారు, చివరకు నేడు, శుక్రవారం, పార్టీ సీనియర్ నేత చిరుకూరు రామకృష్ణ చౌదరి అధ్వర్యాన భీమవరం 39 వార్డుల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశం నిర్వహించి గత నాలుగు ఏళ్లుగా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి చేస్తున్న నిర్ణయాలు ఫై అసంతృప్తి తో రగిలిపోతున్న పలువురు నేతలు తమ బాధను బాహాటంగా వ్యక్తం చెయ్యటం.. రోడ్డుపై తోట.. డౌన్ డౌన్ .. టీడీపీ ని రక్షించాలి అంటూ నిరసన నినాదాలు చెయ్యడం సంచలనమ్ రేపింది. ప్రజాస్వామ్యయుతంగా జరిగిన పట్టణ అధ్యక్ష ఎన్నిక ఫలితాన్ని తోట సీతారామలక్ష్మి తారుమారు చేశారని రామకృష్ణ చౌదరి ఆరోపించారు. నిజానికి ఆ ఎన్నికలో తానే గెలుపొందానని తెలుగుదేశం పార్టీ పట్టణా ధ్యక్షుడిని తానేనంటూ పట్టణంలోని 39 వార్డుల అధ్యక్ష కార్యదర్పుల సమావేశంలో ప్రకటించుకున్నారు. జిల్లా అధ్యక్షురాలిగా, భీమవరం నియోజకవర్గం ఇన్ఛార్జిగా తోట సీతారామలక్ష్మిని తొలగించాలని చౌదరి. డిమాండ్ చేశారు. up file photo
