సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని మార్చాలంటూ సుప్రీంకోర్టు నేడు, సోమవారం సంచలన ఇచ్చింది. దీనిపై విచారణ నిర్వహించిన సర్వోన్నత న్యాయస్థానం.. సీబీఐ దాఖలు చేసిన సీల్డ్ కవర్ నివేదిక ఆసాంతం చదివామని ధర్మాసనం పేర్కొంది. సీబీఐ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసును ఇంకా ఎంత కాలం విచారణ చేస్తారని ప్రశ్నించింది. కేసు అంతా… విచారణ చేసిన అధికారులు రాజకీయ దురుద్దేశ్యంతో, కుట్ర తో కూడినదేనని పదేపదే రిపోర్ట్‌లో రాశారని , కానీ హత్య కు అదొక్కటే ఆధారం కాదని హత్యకు గల ప్రధాన కారణాలు, దాని వెనుక జరిగిన ఘటనలు బయటపెట్టాలని ధర్మాసనం ఆదేశించింది. విచారణాధికారిని మార్చాలని.. లేదా ఇంకో అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇప్పుడున్న అధికారి రామ్ సింగ్‌ను కూడా దర్యాప్తులో కొనసాగించాలని తెలిపింది.
