సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: తెలుగు సినిమాల పాన్ ఇండియా ప్రభంజనానికి బాలీవుడ్ పనైపోయింది అని భావించిన వారికీ బాలీవుడ్ పరువు ను షారుక్ ఖాన్ తన పఠాన్‌తో నిలబెట్టాడు, దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్‌తో మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు, పఠాన్ రిలీజై 50 రోజులకు పైనే అవుతున్నా ఇప్పటికీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తూనే ఉంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1049.50 కోట్ల గ్రాస్ రాబట్టిందీ చిత్రం. (ఈ కలెక్షన్స్ వాస్తవం కాదని కొంత వివాదం కూడా నడుస్తుంది మరి.. )ఇందులో ఇండియా వాటా రూ.657.25 కోట్లు కాగా ఓవర్సీస్‌ది రూ.392.35 కోట్లుగా ఉంది అంటున్నారు బాలీవుడ్ మీడియా.. . అయితే ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన షారుక్ తాజాగా ఓ ఖరీదైన కారు కొనుగోలు చేసిశాడు. రోల్స్ రాయిస్ క్యులినన్ బ్లాక్ బెడ్జ్..ఎస్‌యూవీ కారును తన గ్యారేజీకి తెచ్చుకున్నాడు. దీని ధర దాదాపు రూ.10 కోట్లు ఉండవచ్చని అంచనా!
