సిగ్మాతెలుగు డాట్,ఇన్ న్యూస్: భీమవరం అంబెడ్కర్ ప్రధాన చౌరస్తా సెంటర్ నుండి విజయలక్ష్మి థియేటర్స్ వైపు రైల్వే శాఖ నిర్మించిన అండర్ టర్నల్ బ్రీజ్ వైపు నేడు, మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు, దుర్గాపురం లో ఆక్రమణలు తొలగిస్తున్న నేపథ్యంలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసారు, అయితే అన్ని వాహనాలను తిరిగి సాయంత్రం నుండి అనుమతించారు, అయితే ముందస్తు గా ఎటువంటి సమాచారం లేని కారణంగా వాహనదారులు అటువైపు నుండి ఇంటర్ పరీక్షలు కు వెళుతున్న విద్యార్థులు, తీవ్ర ఇబ్బందులు పడ్డారు, టీపీ గూడెం వైపు వెళ్ళవలసిన వాహనాలు చుట్టూ తిరిగి , ఉండి రోడ్డు బైపాస్ నుండి లేదా 3 టౌన్ నుండి బైపాస్ వైపు రోడ్డుపై మాత్రమే వెళ్ళవలసిన పరిస్థితి. దాదాపు 4 కిలో మీటర్లు చుట్టుతిరిగి వెళ్ళవలసిన పరిస్థితి, ఉంది, ఇక దగ్గర లో ఉండే మెంటే వారి తోటలో కొత్త రోడ్డు నిర్మాణం వల్ల 4 వీలర్ వాహనాలను, ఆటోలను అనుమతించడం లేదు, అయినప్పటికీ ఆ గతుకుల రోడ్డుపై టూ వీలర్ వాహనాలు నడపలేక తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యింది, తీరా అన్ని అడ్డంకులు అధిగమించి విష్ణు కాలేజీ వైపు చేరగానే హెల్మెట్స్ ధరించాలని టాఫిక్ పోలిసుల చైతన్య పరిచే కార్యాక్రమం.. ఇది పరిస్థితి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *