సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అడ్జక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన AVR సభాపతి, మిగిలిన నూతన పాలకమండలి సభ్యులు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నూతన పాలకవర్గాన్ని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. భీమవరంలో అభివృద్ధిలో , సేవాకార్యక్రమాలలో ఛాంబర్ అఫ్ కామర్స్ కు ప్రత్యేక ప్రతిష్ట ఉందని. నూతనంగా .. ఏకగ్రీవంగా ఎన్నికైన ఛాంబర్ పాలకులు కూడా ఆ ప్రతిష్టను మరింత పెంచాలని, వ్యాపార అభివృద్ధి తో పాటు ప్రజా సంక్షేమానికి అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం లో మానేపల్లి సూర్యనారాయణ గుప్త, కాగిత వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *