సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి బుధవారం సాయంత్రం మరోసారి హుటాహుటిన ఢిల్లీ కి బయలుదేరి వెళ్లారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనమై వెళ్లారు. రెండ్రోజుల పాటు ఢిల్లీలోనే ముఖ్యమంత్రి పర్యాటించనున్నారు. ఈనెల 16న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా…సెషన్స్‌ను పక్కన పెట్టి మరీ ప్రధాని మోడీని కలవడానికి హస్తినకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి జగన్ ఢిల్లీ వెళ్లడం.జరిగింది, నేటి రాత్రి 9:30 నిమిషాలకు అమిత్ షాతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. రేపు ఉదయం ప్రధాని మోడీతో సమావేశం అవుతారని భావిస్తున్నారు.నేడు కర్ణాటక వచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూలు ప్రకటించినవేళ కర్ణాటక లో విశేషంగా ఉన్న తెలుగు ఓట్ల ను ఆకర్షించే పనిలో ఇప్పటికే బీజేపీ పావులు కదుపుతుంది మరి,,
