సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ప్రజల అహ్లాదానికే లోటు లేకుండా మరింత ఆధునీకరణ చేస్తూ నిర్మించిన స్థానిక వీరమ్మ ట్యాంక్ లో బివి రాజు పార్క్ ను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరం పట్టణ అభివృద్ధిలో సుందరీకరణ లో తమ వంతుగా ముందుకు వస్తున్న బివి రాజు విద్యాసంస్థలు చేస్తున్న సేవలు అభినందనీయం. ఆబాల గోపాలాన్ని అలరించేందుకు, జిల్లా కేంద్రం భీమవరం ప్రజలు సేద తీరేవిధంగా పార్క్ ను పునరుద్ధరించిన విష్ణురాజును ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అన్నారు. అన్ని ఆధునిక హంగులతో బివి రాజు పునరుద్ధరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం లో విష్ణు విద్యాసంస్థల చైర్మన్ విష్ణురాజు , మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ తదితరులు హాజరయ్యారు.ఆధునిక హంగులతో బివి రాజు పార్క్ పునః ప్రారంభం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *