సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రజలు చిరకాల స్వప్నం భీమవరం-నరసాపురం హైవేలోని గునుపూడి సౌత్ డ్రెయిన్‌పై తాడేరు నూతన వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తన హయాంలో నియోజక వర్గ పరిధిలో 11 వంతెనలు పూర్తీ చేసామని ఇప్పుడు 12వ వంతెనగా ఎన్నో అడ్డంకులు అధిగమించి సీఎం జగన్ సహకారంతో భీమవరం పట్టణానికి 20 గ్రామాలను కలిపే ప్రధాన రహదారిపై సుమారు రూ.2 కోట్ల 30 లక్షలతో తాడేరు వంతెన నూతన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభపరిణామమని , శరవేగంగా నిర్మాణం 6నెలల్లో పూర్తీ చేస్తామని అన్నారు, ముఖ్య అతిధిగా హాజరు అయినా శాసనమండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వంతెనకు మోక్షం లభించిందన్నారు ప్రజా ప్రభుత్వమని, ప్రతిపక్షాలు విమర్శించడం మామూలే కానీ, అభివృద్ధి, సంక్షేమంపై అలసత్వం వహించకుండా విమర్శలు చేయడం తగదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహరాజు, జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ ఎం.శివరామకృష్ణ, తహశీల్దార్ వై.రవికుమార్, ఆర్‌అండ్‌బీడీ రామరాజు, జేఈ శ్రీనివాస్, కోడె యుగంధర్, మానెపల్లి నాగన్న, నల్లం రాంబాబు, చెల్లబోయిన సూర్య ప్రకాష్, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, ycp పార్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
