సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం శ్రీ కృష్ణదేవరాయ ఫంక్షన్ హాల్లో స్వర్గీయ గ్రంధి సత్యనారాయణ మూర్తి, విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్త్రీల వ్యాధుల ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను నేడు, గురువారం ఉదయం రాష్ట్ర శాసన మండలి చైర్మన్, కొయ్యే మోషేను రాజు ప్రారంభించారు, ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్త్రీల వ్యాధుల కు ఉచితంగా వైద్యం అందించడం కోసం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను, మహిళా వైద్యుల ను ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి మోషేను రాజు ఇటీవల మరణించిన మాజీ రాజ్యసభ సభ్యులు,స్వర్గీయ యర్రా నారాయణ స్వామి కుటుంబ సభ్యులను ఉప్పులూరు గ్రామంలో యర్రా నారాయణ స్వామి స్వగృహంకు వెళ్లి పరామర్శించారు.
