సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ ఏప్రిల్ నెల 30నుంచి వచ్చే, మే నెల 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. మొదటి రోజు స్వామి, అమ్మ వార్లను పెండ్లి కొడుకు, పెండ్లి కుమార్తెలను చేస్తారు. రాత్రి 7 గంటలకు గజ వాహనం పై గ్రామోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. మే 4న ఉదయం 7 గంటలకు సింహ వాహనం పై గ్రామోత్సవం , రాత్రి 8.30 గంటలకు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం ఉంటుందని, తదుపరి వెండి గరుడ వాహనంపై స్వామి వారిని గ్రామంలో ఊరేగిస్తామన్నారు. 5న రాత్రి 7.30 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. ఉత్సవాల ఎనిమిది రోజులు స్వామివారి నిత్యా ర్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలు రద్దుచేసినట్లు తెలిపారు
