సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: దేశవ్యా ప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) తాజగా విడుదల చేసిన ప్రకటన ఆధారంగా మొత్తం 36 కేంద్ర శాఖల్లోని 7500 కేంద్ర ఉద్యోగాలు పోస్టులు భర్తీ చెయ్యనున్నారు. ఆయా విభాగాలవారీ వివరాలను తర్వాత ప్రకటిస్తారు. ఇంకా పోస్టుల సంఖ్య పెరగడానికీ అవకాశం ఉంది. టైర్-1, టైర్-2 పరీక్షల్లో చూపిన ప్రతిభతో నియామకాలు చేపడతారు. అలాంటివాటిలో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్ఈ) ముఖ్యమైంది. అభ్యర్థులు డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారికి మంచి హోదాతోపాటు ఆకర్షణీయ జీతం ఉంటుంది. సీజీఎల్ఈలో ప్రతిభ చూపినవారు గ్రూప్- బీ, సీ పోస్టుల్లో సేవలందించవచ్చు . గెజిటెడ్ ఉద్యోగాలైన అసిస్టెంట్ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులనూ పొందవచ్చు. అభ్యర్థుల వయస్సు: ఆగస్టు 1, 2023 నాటికి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఇంటెలిజెన్స్ బ్యూరో మినహా), సబ్ ఇన్స్పెక్టర్ సీబీఐ పోస్టులకు 30 ఏళ్లలోపు ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కు 32, మిగిలిన గ్రూప్-బి పోస్టులకు 30 ఏళ్లలోపు వయసు ఉండాలి. అన్ని గ్రూప్-సి పోస్టులకు 27 ఏళ్లలోపువాళ్లే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు లభిస్తుంది.ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మే 3, టైర్-1 పరీక్షలు: జులైలో నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *