సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రవేటీకరణ అడ్డుకొనేందుకు పై తెలంగాణ సీఎం కెసిఆర్ ఆపద్భాంధవుడు తరహా పాత్రతో దిగిపోవడంతో ఒక్కదెబ్బకు 2పిట్టలు తరహాలో అటు కేంద్రం మరో ప్రక్క ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్ లో బిఆర్ ఎస్ చక్రం తిప్పడానికి సన్నాహాలు చేస్తుండటంతో తెలంగాణ మంత్రి మంత్రి హరీష్ రావు సడన్‌గా ఏపీలోని జగన్ సర్కార్ ఫై స్వరంగా మార్చేశారు. తెలంగాణలోని ఏపీ కార్మికులు ఆంధ్రాలో ఓటు రద్దు చేసుకోవాలని.. ఇక్కడ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని.. ఏపీ, తెలంగాణలో ఎవరి పాలన బాగుంది? అనేది ప్రజలే చెప్పాలని కూడా పిలుపునిచ్చారు. ఏపీ, తెలంగాణకు.. భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా..? అని హరీష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే భగ్గుమనే పరిస్థితులు ఉండగా.. అయితే హరీష్ కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా ఆంధ్రాకు చెందిన నెటిజన్లు, ఏపీలోనూ తెలంగాణలోని, వై యస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం జగన్ వీరాభిమానులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు. తెలంగాణ రాజకీయాలలో జగన్ అడుగుపెడితే ఎలా ఉంటుందో ? తెలుసా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఉద్యమ సమయంలో ఆంధ్రోళ్లను, ముఖ్యంగా ఉద్యోగస్తులపై హరీష్ , టీఆరెస్ నేతలు దాడి చేసిన సంఘటనలను కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలను సైతం వైసీపీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. కరోనా టైమ్‌లో తెలంగాణ లో ప్రజలను గాలికి వదిలేశారని ఏపీ సీఎం జగన్ తెలుగు రాష్ట్రాల ప్రజలను అక్కున చేర్చుకొని కాపాడారని గుర్తు చేస్తున్నారు. ఈ పరిణమాలు వచ్చే తెలంగాణ ఎన్నికలలో ఎటువంటి మలుపులు తిగుతాయో?నని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇదంతా వైసీపీ, బీఆర్ఎస్ లు, కేంద్రంలోని బీజేపీ,ఏపీలో టీడీపీ, జనసేన ను అడ్డుకొనేందుకు ప్యూహం ప్రకారం చేస్తున్న మైండ్ గేమ్ అనే కామెంట్స్ కూడా వస్తున్నాయ్.
