సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటివరకు ఏపీలో జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థపై తీవ్ర వ్యతిరేకత ను, కేవలం 5 వేల రూపాయలతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏమిటి? వాళ్ళు ఇంట్లో మగాళ్లు లేనప్పుడు ఇంటికి రావడం ఏమిటి? అని ప్రశ్నించిన తెలుగు దేశం పార్టీ తాజాగా తన స్టాండ్ మార్చుకొంది. నేడు, బుధవారం రాష్ట్రంలోని టీడీపీ సర్పంచ్‌లతో ఈ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ పాలన అంతం కావాలని వైసీపీ సర్పంచ్‌లే అంటున్నారని,. రాష్ట్రంలో సర్పంచ్‌ల విధులు, నిధులు లాక్కొని ఉత్సవ విగ్రహాలుగా మార్చారని మండిపడ్డారు. వైసీపీ సర్పంచ్‌లను కలుపుకొని చలో అమరావతి, చలో ఢిల్లీ చలో కలెక్టరేట్ ముట్టడి వంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇక రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, వారు ప్రజాసేవ చేస్తే స్వాగతిస్తామని ప్రకటించారు. అయితే ప్రజాధనం జీతంగా తీసుకుంటూ వైసీపీకి సేవ చేయడమేంటి? అన్నదే తమ అభ్యన్తరం అని , వాలంటీర్ లు ప్రైవేట్ ఆస్తులు, ప్రజల ఇళ్లకు స్టిక్కర్లు అంటించడం నేరమని, ఇటువంటి పనులు చెయ్యకూడదని చంద్రబాబు తెలిపారు. వైసీపీలో లోలోన అటు కార్యకర్తలు ఇటు వలంటీర్లు నలిగిపోతున్నారు.. వలంటీర్‌ వ్యవస్థ కారణంగా అధికార పార్టీ నాయకులు అసహనంతో ఉంటే.. రాజకీయ వేధింపులు..కష్టపడి పనిచేస్తున్న వాలంటర్స్ కు అవార్డుల ఎంపికలో అన్యాయం.. జీతాలు పెంచకపోవడం తదితర కారణాలతో వలంటీర్లు అసంతృప్తిగా ఉన్నారు.. జగనన్న నువ్వే మా నమ్మకం కార్యక్రమంలోవారి మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఈ వ్యతిరేకత ఎటు దారి తీస్తుందోనని వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారుఅని చంద్రబాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *