సిగ్మాతెలుగు డాట్ , ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి ప్రాంతంలో నేడు, శుక్రవారం ఉదయం స్థానిక ఫైర్ స్టేషన్ ఆవరణలో జరిగిన అగ్నిమాపక శాఖ అమర వీరుల సంస్మరణ కార్యక్రమంలో శాసన మండలి ఛైర్మన్, కొయ్యే మోషేను రాజు పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. మరియు Dr BR అంబేద్కర్ గారి 132 వ జయంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఫైర్ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. సైనికుల వాలే తమ ప్రాణాలు కు తెగించి అగ్ని మాపక సిబ్బంది ప్రజల ఆస్తులు ప్రాణాలు కాపాడటం దేశానికీ గర్వకారణం అన్నారు. ఈ మండు వేసవిలో మీ సేవలు ప్రజలకు మరింత అవసరం అన్నారు. తదుపరి భీమవరం గునుపూడి అంబేద్కర్ నగర్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు తాడేరు రోడ్డు లో గల అంబేద్కర్ కాంస్య విగ్రహంల వద్ద ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదుపరి వీరవాసరం మండలం చింతలకోటి గరువు లో DR BR అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా కొయ్యే మోషేను రాజు మాట్లాడుతూ.. అంబెడ్కర్ కోరుకున్నట్లు తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని చక్కగా చదివించాలని విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. తదుపరి స్థానిక కలెక్టరేట్ లో అంబేద్కర్ జయంతి కార్యక్రమం లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *