సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, శనివారం పాన్ కార్డు – ఆధార్ లింకింగ్ ఫై కొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఆలస్యం చేసినవారు పాన్ కార్డు లింక్ చేసేందుకు రూ.1000 పెనాల్టీ చెల్లించి కూడా చేసుకోవచ్చు . అయితే డబ్బు చెల్లించడానికి ముందు, ఆదాయపు పన్ను శాఖ అసెస్మెంట్ ఇయర్ ఆప్షన్ ఎంచుకోవాలి. గతంలో పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోవానికి మార్చి 31 చివరి గడువుగా ప్రకటించారు. అయితే ఈ గడువు ప్రస్తుతం పొడిగించారు. కావున అసెస్మెంట్ ఏడాదిని 2023 – 24గా కాకుండా, అసెస్మెంట్ ఇయర్ను 2024-25గా ఎంచుకోవాలి. పేమెంట్ చేయడానికి అదర్ రిసిప్ట్స్ (500) అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. ఈ మార్పుని డబ్బు చెల్లించడానికి ముందే చూసుకోవాలి. లేకపోతె కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 ఏఏ ప్రకారం పాన్ కార్డు ఉన్న వారు తప్పనిసరిగా ఆధార్ నంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే లింక్ చేసుకున్నవారు కూడా ఓసారి స్టేటస్ చెక్ చేసుకుని పాన్-ఆధార్ లింక్ అయ్యిందో? లేదో
చూసుకోవడం మంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *