సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్ట్ చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. నేటి ఆదివారం తెల్లవారుజాము నుంచి పులివెందులలో టెన్షన్ వాతావరణమే నెలకొంది. వైసిపి కార్యకర్తలు విశేషంగా భాస్కర్ రెడ్డి ఇంటికి చేరుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నపటికీ భాస్కర్ రెడ్డి పులివెందులలో ఇంటివద్దే ఉండి అరెస్ట్ అయ్యారు. అధికారులు . ఆయన్ను అరెస్ట్ చేసి పులివెందుల నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. ఇవాళ సాయంత్రంలోపు మెజిస్ట్రేట్ ముందు భాస్కర్‌రెడ్డిని హాజరుపరుస్తామని అధికారులు చెబుతున్నారు.సిబిఐ అదిత్క్రులు విచారణలో భాగంగా రెండో రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎంపీ అవినాష్‌రెడ్డి ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *