సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రేదేశ్ లో ఎండ తీవ్రతకు వడగాడ్పులు తోడవడంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు లో ప్రజలు ఎండ తీవ్రతకు నానరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. నేడు, ఆదివారం ఉదయం నుండి ఉత్తర కోస్తా ఆంధ్ర లో తీవ్ర వడగాడ్పులు కొనసాగుతున్నాయి. గత, శనివారం అనకాపల్లి, కాకినాడ, విజయనగరం జిల్లాల్లోని 13 మండలాలతో పాటు మరో 55 మండలాల్లో వడగాడ్పులు ఉధృతంగా వీచాయి. భీమవరం, ఏలూరులలో కూడా ఎండ తీవ్రత గత 4 రోజులుగా అగ్ని కొలిమిని తలపిస్తుంది. సుమారు 40 డిగ్రీలు తాకుతుంది. అయితే సాయంత్రానికి చలిగాలులు వీస్తుండటం కొంత ఉపశమనం. ఇటు కోస్తాతోపాటు రాయలసీమలో ఎండ తీవ్రంగా ఉంది. విజయనగరంలో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 18 వరకు ఉత్తర కోస్తాలో వడగాడ్పులు వీస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గత శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురవడం విశేషం.
