సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్ణాటక లో వచ్చే మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులతో కాంగ్రెస్ కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాను అడిగిన అభ్యర్థులకు బీజేపీ అధిష్టానం టికెట్స్ ఇవ్వడం లేదని అలిగిన లింగాయత్ వర్గానికి చెందిన బీజేపీ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్య మంత్రి జగదీశ్ శెట్టర్, నేడు, సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం తో బీజేపీ తీవ్ర భంగపాటుకు గురయింది. జగదీశ్ శెట్టర్ గత ఆదివారం ఉదయం తన .. ఎమ్మె ల్యే పదవికి, బీజేపీ సభ్యత్వానికి రాజీనామా ప్రకటించారు. ఆతర్వాత తన అనుచరులతో కలిసి ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రణ్దీ ప్సింగ్ సూర్జేవాలా, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ మంత్రి ఎం బీ పాటిల్తో సమావేశమయ్యా రు. ఈ క్రమం లో తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో బెంగళూరులోని కార్యా లయం లో ఆ పార్టీ తీర్థం పుచ్చు కున్నారు.ఈ సందర్భముగా కాంగ్రెస్ జాతీయ అడ్జక్షుడు ఖర్గే మాట్లాడుతూ..‘శెట్టర్ గురించి మీకు చెప్పా ల్సిన పనిలేదు. ఆయన ఒంటరిగా గెలవడమే కాదు.. మరిన్ని సీట్లు గెలిపించే సత్తా ఉన్న నేత’అని అభివర్ణించారు.
