సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో .. సినిమా హీరోల కోసం హద్దులు దాటిన అభిమానం ఒక యువకుడి ప్రాణం ప్రాణం తీసిన ఘటన నేడు, ఆదివారం వెలుగులోకి వచ్చింది,. తణుకు సీఐ సీహెచ్ ఆంజనేయులు మీడియాకు చెప్పిన వివరణ ప్రకారం.. ఏలూరుకు చెందిన పెయింటర్లు హరికుమార్, కిశోర్‌లు అత్తిలిలో ఓ ఇంటికి రంగులు వెయ్యటానికి మూడు రోజుల కిందట వచ్చారు. హరికుమార్ ప్రభాస్ అభిమాన సంఘానికి కార్యదర్శిగా కూడా ఉన్నాడు. తన వాట్సాప్‌లో ప్రభాస్ వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. అయితే కిశోర్ పవన్ కల్యాణ్ అభిమాని. దీంతో పవన్ కల్యాణ్ వీడియోను కూడా స్టేటస్‌లో పెట్టుకోవాలని హరికుమార్‌ ఫై వత్తిడి తెచ్చాడు. అందుకు హరికుమార్ ఒప్పుకోలేదు. దీనిపై ఇద్దరి మధ్య గత శుక్రవారం రాత్రి ఘర్షణ జరిగింది. చిన్నగా మొదలైన ఈ గొడవ కొట్టుకునేవరకూ వెళ్లింది. ఇంతలో క్షణికావేశంలో హరికుమార్ సెంట్రింగ్ పైపుతో కొట్టడంతో పాటు సిమెంట్ రాయితో ముఖం మీద బలంగా కొట్టడంతో కిశోర్ అక్కడికక్కడే మరణించాడు. దీనితో హరికుమార్ అక్కడి నుండి పరారిలో ఉన్నాడని సమాచారం. అయితే సినిమా హీరోల కోసం ఒళ్ళు తెలియని ఆవేశంతో ఉద్రేకంలో సాటి సహచరులతో హద్దులు దాటి గొడవ పడటం చాల చాల దురదృష్టకరం..వారి కుటుంబాలలో తీరని విషాదాన్ని ఎవరు తీరుస్తారు?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *