సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రజనీకాంత్ చంద్రబాబు ను పొగుడుతూ చేసిన రాజకీయ వ్యాఖ్యలపై వైసిపి నేతలు రజనీ కాంత్ ఫై తీవ్ర ఆగ్రవేశాలు ప్రదర్శిస్తున్నారు. ముఖ్యము గా మాజీ మంత్రి కొడాలి నాని నేడు, మీడియా సమావేశంలో రజని కాంత్ ను దేశంలో ఎవరు ఇప్పటివరకు తిట్టని దారుణ పదాలతో విమర్శించారు. కొడాలి నాని మాటలలో.. ఒక్కప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన టీమ్ లో చంద్రబాబు కు మద్దతు తెలిపిన పరమ నీచుడు రజనీకాంత్..ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతుండగా వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకు మద్దతు తెలిపిన రజనీకాంత్ ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడటం సిగ్గుచేటు. ఎన్టీఆర్ బ్రతికి ఉన్నపుడు ఆయన పార్టీ దొబ్బేసి , కుట్ర చేసి సీఎం పదవి దింపేసిన వెధవలలో ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు రజనీకాంత్ కూడా ఉన్నాడు. ఈ వెధవలంతా 100 ఏళ్ళు బ్రతకవలసిన ఎన్టీఆర్ ను మానసిక క్షోభ పెట్టి 74 ఏళ్లకే పైకి పంపించేసి ఇప్పుడు ఆయన పేరుతొ శత జయంతి వేడుకలు చెయ్యడం అందులో చంద్రబాబు ను పొగడటం చూసి ఎన్టీఆర్ అభిమానులు సహించలేరు. పెద్ద వయస్సు వచ్చేసింది ఎండిపోయిన తాడి టెంకలా మారిన రజని కాంత్ తన మిత్రుడు చంద్రబాబు కోసం కృష్ణ నది కరకట్ట దగ్గర ఆక్రమించిన గెస్టు హౌస్ లో భోజనం చేసి రాత్రి సభలో బాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు. అసలు ఎక్కువ సీట్లు అడుగుతున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే.. రజనీకాంత్‌ను చంద్రబాబు రంగంలోకి దించారు. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ గ్రహించాలి. మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉండే రజనీకాంత్, తెలుగు ప్రజలకు ఏం చెబుతారు..?అని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *