సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో సముద్ర తీర ప్రాంతాలలో వేటకు వెళ్లిన మత్యకారుల గల్లంతులు, వారు దొరక్క పోవడం ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవల బీ.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామానికి చెందిన మత్స్యకారుల బోటు సముద్రంలో గల్లంతైన ఘటనపై,రోజులు గడుస్తున్నా ఇప్పటికి వారి ఆచూకీ లభించకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా మత్యకార సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నేడు, మంగళవారం సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు. బోటులో ఉన్న ఎనిమిది మంది మత్స్యకారుల ఆచూకీ కోసం చేపడుతున్న గాలింపు చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన బోటు, మత్స్యకారుల ఆచూకీ లభించే వరకూ గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *