సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడువారాల శ్రీ వెంకటేశ్వర స్వామిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది గోదావరి జిల్లాల తిరుమలగా ప్రసిద్ధి చెంది కోట్లాది రూపాయలు భక్తుల కానుకల రూపంలో ఆదాయం పొందుతున్న ‘వాడపల్లి’ వెంకన్న ‘ ఆలయం మరింత అభివృద్ధి చేస్తున్నారు.. ఆలయంలో ప్రతి నిత్యం భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తుంటారు. భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు సౌకర్యాలు పెద్దగా లేవు.. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం కొన్ని నిధులు, దాతలు మరికొన్ని నిధులు అందించగా మొత్తం రూ.6.25 కోట్లతో ఆలయం దగ్గర ఆధునిక సౌకర్యాలతో కిచెన్, ఒకేసారి 3వేలమంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించేలా భోజనశాలకు అన్నదానం షెడ్‌ను నిర్మించామని ఈ నెలలోనే 26న ప్రారంభించబోతున్నట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్యచక్రధరరావు ( భీమవరం శ్రీ మావుళ్ళమ్మ దేవాలయం సహాయ కమిషనర్ గా సుదీర్ఘ కాలం గతంలో పనిచేసారు) తెలిపారు. రథశాల, కోనేరు నిర్మాణ పనులు ముగింపు దశకు వచ్చాయని..భారీ అన్నదాన షెడ్‌కు తిరుమల తరహాలోనే వకుళమాత అన్నదాన భవనంగా పేరు పెట్టనున్నారు.
