సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: నేడు, శనివారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాల్లో 10వ తరగతి ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో జిల్లాల వారీగా విద్యార్థుల ఉత్తీర్ణత స్థానం బట్టి చుస్తే .. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలలో ఫలితాలు తీవ్ర నిరాశ ను మిగిల్చాయి. తాజా ఫలితాలలో 21వ స్థానంలో పశ్చిమ గోదావరి, 22వ స్థానంలో ఏలూరు జిల్లాలు నిలిచాయి. 65.93% ఉత్తీర్ణత తో 21వ స్థానంలో నిలిచిన పశ్చిమ గోదావరి జిల్లా వెంట 22వ స్థానంలో ఏలూరు జిల్లా విద్యార్థులు 64.35% ఉత్తీర్ణతతో నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 20268 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 13362 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక ఏలూరు జిల్లాలో 22259 మంది పది పరీక్షలకు హాజరుకాగా 14323 మంది ఉత్తీర్ణత సాధించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధమ శ్రేణిలో 9998 మంది, ద్వితీయ శ్రేణిలో 2291 మంది, తృతీయ శ్రేణిలో 1073 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏలూరు జిల్లాలో ప్రధమ శ్రేణిలో 10576 మంది, ద్వితీయ శ్రేణిలో 2585 మంది, తృతీయ శ్రేణిలో 1162 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. 10వ తరగతి ఫలితాలలో ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ స్థానం మొదలుకొని టాప్ 5 లో ఉండే పశ్చిమ గోదావరి జిల్లాలో విద్య ప్రమాణాలు ప్రతి ఏడాది, ఏడాదికి ఇలా చివరి నుండి 5స్థానాలకు పడిపోవడం ఫై విద్య శాఖ అధికారులు ద్రుష్టి పెట్టాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *