సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో వాడవాడలా నేడు, ఆదివారం .. స్వాతంత్రోద్యమం లో ప్రభవించిన విప్లవాగ్ని.. అల్లూరి సీతారామ రాజు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఏ ఎస్ ఆర్ నగర్ లోని దేశ ఖ్యాతి గాంచిన 35 అడుగుల అల్లూరి సీతారామ రాజు విగ్రహంతో పాటు, ప్రకాశం చౌక్ లోను, ఇక్కడికి సమీపంలోని అల్లూరి .. స్వగ్రామం మోగల్లు లోను పలుచోట్ల అల్లూరి.. విగ్రహాలకు పుష్ప మాలలు వేసి స్థానికులు, ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. దీనిలో భాగంగా నరసయ్య అగ్రహారంలోని అల్లూరి విగ్రహం వద్ద అల్లూరి సీతారామరాజు యువజన సంఘం అధ్వర్యంలో అల్లూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంతేటి వెంకట రాజు , చెరుకువాడ రంగసాయి లు మాట్లాడుతూ, నా దేశం, నా ప్రజలు పరాయి పాలనలో ఉండటం సిగ్గు చేటని విల్లంబులతో మన్యం మన్యం ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన అల్లూరి చిరస్మరణీయుడని అన్నారు. కార్యక్రమంలో యిందుకురి సుబ్రహ్మణ్యం, కడలి వెంకటేశ్వరరావు, పత్సమట్ల సూర్యనారాయణ రాజు, తిప్పా ముత్యం, కే రాం ప్రసాద్, ముదునూరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారున్నారు
