సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేరళ రాష్ట్రము లోని మలప్పురం జిల్లాలో గత ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర పడవ ప్రమాదములో నేటి సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 22కు పెరిగినట్లు అధికారులు నిర్ధారించారు. వీరిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరింత విషాదం.. ఈ దుర్ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలను ఆదుకొంటామన్నారు. తనూర్ ప్రాంతంలోని తువల్తీరం బీచ్ సమీపంలో ఆదివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఓ హౌస్ బోట్ బోల్తాపడిన పడిన దుర్ఘటనలో 30 మంది టికెట్స్ తీసుకోని పడవ ఎక్కితే మరికొందరు టికెట్ లేకుండా ఎక్కారని తెలుస్తుంది. దీనితో సామర్ధ్యానికి మించి జనం ఉండటంతో బోటు తిరగబడింది అని భావిస్తున్నారు. నేటి సోమవారం ఉదయానికి 22 మంది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. మరో 8 మందిని కాపాడి స్థానిక ఆసుపత్రులకు తరలించారు. గల్లం తైన వారి కోసం ఘటనాస్థలం లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF), భారత కోస్ట్ గార్డ్ సిబ్బం ది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *