సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హడావిడి లేకుండా స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ సేవలకు సంబంధించిన సుమారు10 సేవలకు సంబందించిన యూజర్ చార్జీలు పెంచడంతో పశ్చిమ గోదావరి జిల్లా రిజిస్టర్ కార్యాలయాలలో భూములు, ఆస్తులు క్రయవిక్రయదారులు కు అదనపు భారం పడుతుంది. లక్షలలో రిజిస్టర్ పీజులు చెల్లించేవారికి ఇది పెద్ద భారం కానప్పటికీ, సామాన్యులకు ఇబ్బందిగానే ఉంది. ఉదాహరణకు ఒకొక్క డాక్యు మెంట్ కు ఇప్పటివరకు రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేస్తుండగా.. దానిని ఏకంగా రూ.500 చేశారు. రిజిస్ట్రేషన్ జరిగిన ఆస్తికి సంబంధించి దస్తావేజు నకలుకు ఇప్ప టివరకు రూ.20 వసూలు చేస్తుండగా.. ఇప్పుడు రూ.100 చేశారు. పెంచిన అదనపు చార్జీలను ప్రస్తుతము ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 27 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్ప టికే అమలు చేస్తున్నా రు. తద్వా రా ప్రభుత్వ ఖజానాకు రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో ఈ యూజర్ చార్జీల ద్వారా ఏడాదికి 30 కోట్ల పైగా ఆదాయం వస్తే ఈ ఏడాది 60 కోట్ల రూపాయలు పైగా పెరుగుతుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *