సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ముందుగా కర్ణాటక లో కాంగ్రెస్ ప్రభంజనాన్ని ఊహించినట్లే ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా నేడు, శనివారం మద్యాహ్నం 12. 40 నిమిషాలకు కర్ణాటకలో కౌంటింగ్ జరుగుతుండగానే రాష్ట్రంలో మొత్తం 224 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ 124 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతూ అధికారం సాధించే దిశగా దూసుకొనిపోతుంది. మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలకు కన్నా ఎక్కువ స్థానాలలో తన సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అభ్యర్థులు కేవలం 69 స్థానాలలో మాత్రమే ఆధిక్యతలో ఉండగా జేడీఎస్ 25 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీ విజయం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులలో మంచి జోష్ నింపింది. సరిహద్దులో ఉన్న తెలంగాణ లో అయితే కాంగ్రెస్ శ్రేణులకు బోనస్ బలం కలసినట్లు అయ్యింది. ఓవైపు ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. కౌంటింగ్ పూర్తీ అయ్యాక, గెలిచిన ఎమ్మెల్యేలను ఎవరి ప్రలోభాలకు లొంగకుండా చూసేందుకు నేటి సాయంత్రం కు తమిళనాడు తరలించేందుకు పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తున్నట్టు పార్టీ వర్గాల తాజా సమాచారం. అక్కడి తమ మిత్రపక్షమైన డీఎంకేతో సంప్రందిపులు సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ని కర్ణాటకలో సాహోసోపేతంగా విజయతీరాలకు చేర్చిన DKశివ కుమార్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *