సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణాదిన రాష్ట్రాల రాజకీయాలలో తీవ్ర ప్రభావం చూపించేలా.. బీజేపీ కి పరాజయం రుచిని చూపించి.. కీలకమైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 135 స్థానాలకు పైగా అపూర్వ గెలుపు దిశగా దూసుకుపోతుండంతో ఆ పార్టీ అపర చాణుక్యుడు.. రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ ఒక్కసారిగా భావోగ్వేగానికి గురయ్యి కంటతడి పెట్టారు. తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేకు కర్ణాటక లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తానని మాటిచ్చానని, జైలులో ఉండగా తనను సోనియాగాంధీ స్వయంగా వచ్చి కలుసుకున్నారని, అది ఎప్పటికీ మరిచిపోలేదని అన్నారు.కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 140 సీట్లు గెలుచుకుంటుందని మొదట్నించీ డీకే శివకుమార్ దమ్ముగా చెబుతున్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎవరిని సీఎంగా ఎంపిక చేసినా దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.
