సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎందుకు 2000 రూ, నోట్లు దేశంలో తగ్గిపోతున్నాయి. మొత్తానికి ఎప్పటి నుండోజరుగుతున్నా ప్రచారం నేడు, శుక్రవారం నిజం అయ్యింది. రూ.2000 నోటు చలామణిపై సందేహాలకు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) చెక్ పెట్టింది. ఈ పెద్ద నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు నోట్ల జారీని తక్షణమే నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. అయితే సెప్టెంబర్ 30, 2023 వరకు ఈ నోటు చట్టబద్ధంగానే చెల్లుబాటు జరుగుతుంది. అయితే ఇప్పటికే ఎవరి వద్దయినా నోట్లు ఉంటే సెప్టెంబర్ 30 లోగా బ్యాంకుల వద్ద మార్చుకోవచ్చు. తరువాత 2000 నోట్లు కు విలువ ఉండదు మరి.. 2024 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళా ఈ సంచలన నిర్ణయం వెనుక మతలబు ఏమిటో? లేక 2023 చివరలోనే ఎన్నికలు వస్తున్నాయా?
