సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి కాలం స్కూల్ పిల్లలకు సెలవులు, శుభకార్యాలు తో ప్రయాణాల రద్దీ నేపథ్యంలో నరసాపురం – కాచిగూడల మధ్య ప్రత్యేక రైళ్లు ను నడుపుతున్నట్లు భీమవరంలోని రైల్వే అధికారులు తెలిపారు. కాచిగూడ నుండి 07653 నెంబర్‌తో ఈ నెల 25, వచ్చేనెల 1వ తేదీలలో రాత్రి 8.30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6న్నర గంటలకు భీమవరం చేరుకొని.. ఉదయం 7గంటల కల్లా నరసాపురం చేరుకుంటుందన్నారు. తిరిగి 07654 నెంబర్‌తో నరసాపురంలో ఈనెల 26, వచ్చే నెల 2వ తేదీలలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50కి కాచిగూడ చేరుతుందన్నారు. ఈ స్పెషల్‌ రైలు పాలకొల్లు, భీమవరం టౌన్‌, ఆకివీడు, గుంటూరు, నల్గొండ, మౌలాలీ, మల్కాజిగిరి స్టేషన్‌లో ఆగుతుందన్నారు.కావున ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *