సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,శనివారం హైదరాబాద్ లో చంద్రబాబు ముఖ్య అతిధిగా నందమూరి కుటుంబం తో పాటు, తెలుగు అగ్ర సినీ హీరోల సమక్షంలో నిర్వహిస్తున్నస్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్లు ఆయన మనవడు, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించి నిర్వాహకులకు, తెలుగు దేశం పార్టీ వర్గాలకు నిరాశ కలిగించారు. జూ. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనకు ఈ రోజు ముందస్తు కార్య క్రమాల వల్ల గైర్హాజరవుతున్నట్లు.. ఈ విషయాన్ని ఆహ్వానం ఇచ్చే టప్పుడే సావనీర్ కమిటీకి చెప్పినట్లు ఎన్టీఆర్ స్పష్టం చేశారు. విజయవాడలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూ. ఎన్టీఆర్ ను పిలవకుండా రజనీకాంత్ ను ముఖ్య అతిధిగా పిలవడం, ఆయన రాజకీయ వ్యాఖ్యలుతో.. వైసిపి నేతల విమర్శలతో ఆ సభ వివాదాస్వాద సభ గా మారిపోయిన నేపథ్యంలో .. ఈసారి నిర్వాహక కమిటీ,జూ. ఎన్టీఆర్ ను ఆహ్వానించిన కూడా ఆయన సభకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ వేదికపై ఉండే సభలో జూ. ఎన్టీఆర్ పాల్గొనక పోవడం కారణం ఏదైనా, వారి మధ్య పెరిగిన దూరంపై.. టీడీపీ వర్గాలలో చర్చకు దారితీస్తుంది. కైత్లాపూర్మై లోని 10 ఎకరాలలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గం టల వరకు ఉత్స వాలు నిర్వహించనున్నారు.భారీ వేదికనుసిద్ధం చేశారు. వేదిక ముందు, పక్క న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, అగ్ర హీరోలు వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్ హాజరు అవుతారని భావిసున్నారు.
