సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలలో పలు దొంగతనాలు చేసిన అంతర జిల్లాల దొంగల ముఠా సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణ పోలీసులు పట్టుకొన్నారు. . వీరి నుంచి రూ.53.70 లక్షల విలువైన ద్వి చక్ర వాహనాలు, మొబైల్ ఫోన్ లు , పాడి గేదెలును కూడా స్వాధీనం చేసుకున్నా రు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ,పాలకొల్లు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశం లో వారి వివరాలు తెలిపారు. పాలకొల్లు నుండి నరసాపురం వైపు వెళ్లే రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి వద్ద పట్టణ పోలీసులు వాహనలు తనిఖీలు నిర్వహిస్తుండగా ముగ్గురు అనుమానాస్పదం గా కనిపించిన ముగ్గురుని పట్టుకొని విచారించగా వారి దొంగతనాలు చరిత్ర తెలిసింది. తోటమెరకకు చెందిన నెల రాజశేఖర గాంధీ, బొంతువారిమెరకకు చెందిన బొంతు యువ కిశోర్ కుమార్, ఆచంట మండలం కి చెందిన కొల్లి జయరాజులను అదుపులోకి తీసుకున్నా రు. వీరు పాలకొల్లుతోపాటు గుంటూరు, ఏలూరు, విజయవాడ, ఆచంట, తణుకు, నిడదవోలు, జంగారెడ్డిగుడెం, అమలాపురం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో దొంగిలించిన 40 ద్వి చక్ర వాహనాలు, 3 గేదెలు స్వాధీనం చేసుకున్నా రు. వీటి విలువ రూ.30 లక్షలు ఉంటుంది. అలాగే సెల్ ఫోన్ ట్రాకింగ్ టీం ద్వారా 158 సెల్ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ.23.70 లక్షలు ఉంటుంది. వీరికి సహకరించిన కొండేటి నాగరాజు, కొండేటి పవన్, సాయిచంద్రారెడ్డి, కొనుతు వీరవెంకటసత్య నారాయణలను పోలీసులు అరెస్టు చేశారు. తెలివిగా దొం గల్ని పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రవిప్రకాశ్ రివార్డులు అందజేశారు. డీఎస్పీ మనోహరచారి, సీఐ డి.రాం బాబు, పట్టణ ఎస్సై లు బి.శ్రీనివాస్, ముత్యా లరావు, సెల్ ఫోన్ ట్రాకింగ్ టీంని అభినం దిం చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *