సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో గత శనివారం సాయంత్రం స్థానిక వైసిపి నేతలు చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలియజేసారు. ఈ సందర్భముగా నేతలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ళు లేనటువంటి పేద వారికి, దేశంలో ఎక్కడా లేని విధంగా సెంటు భూమి చప్పున 30 లక్షల కుటుంబాలకు ఎత్తున ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు, ఇళ్ళు నిర్మించే కార్యక్రమంలో భాగంగా ఆర్ధిక సహకారం కూడా అందిస్తున్నారని దానిని చూసి ఓర్వలేక పలువురు టీడీపీ నేతలు ..పచ్చమీడియా, తీవ్ర వ్యాక్యలు చేస్తున్నారని,అయితే అన్ని అడ్డంకులు అధిగమించి సుప్రీం కోర్ట్ తీర్పుతో .. రాజధాని అమరావతిలో 50వేల మందికి జగన్ సర్కార్ ఇళ్ళ పట్టాలు ఇవ్వడానికి నిర్ణయించడంపై, చంద్రబాబు తీవ్ర ఆక్రోశంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలను కించపరిచేలా… ”మీకు ఇచ్చే సెంటు భూమి శవం పూడ్చడానికి సరిపోతుందంటూ.. శ్వాసనాల కోసం సెంటు స్థలాలు ఇస్తున్నారా ?” టీడీపీ నేత చంద్రబాబు చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తున్నామన్నారు.
