సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు లో నేడు, ఆదివారం దెందులూరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, అప్పన కనక దుర్గాప్రసాద్ మరియు ఇతర డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో, స్థానిక ఎమ్మెల్యే, అబ్బయ్య చౌదరి తో కలసి, రాష్ట్ర శాసన మండలి చైర్మన్ శ్రీ కొయ్యే మోషేను రాజు పాల్గొని నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి జిల్లాలో దెందులూరు మార్కెట్ యార్డ్ కు విశిష్ట చరిత్ర ఉందని దాని ప్రతిష్టను మరింత పెంచేలా రాష్ట్రంలో జగన్ సర్కార్ సహకారంతో రైతాంగం కు మేలు చేస్తూ మీ పదవులకు వన్నె తేవాలని మోషేను రాజు కమిటీ సభ్యులకు పిలుపు నిచ్చారు.
