సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు గత ఆదివారం సాయంత్రం సన్నాయి మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో శ్రీ అమ్మవారి ఘటాల తో నృత్య కళాకారుల నృత్యాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. జేష్ఠమాస ప్రారంభంగా శ్రీ అమ్మవారి ని ప్రత్యేక పూజలు నిర్వహించి నిలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు మరియు చైర్మెన్ మానేపల్లి నాగేశ్వరరావు, దేవాలయ సహాయ కమిషనర్ యర్రం శెట్టి భద్రజీ తదితరులు పాల్గొన్నారు. ఈ జేష్ఠమాసంలో శ్రీ అమ్మవారి ప్రతి రూపంగా వెండి ఘట్టాలను నెత్తి మీద పెట్టుకొని కళాకారులు పట్టణంలోని అన్ని వీధులు తిరుగుతూ ఇంటింటికి వెళ్లి అమ్మవారి అస్సిసులు అందజేస్తారు. ప్రతి ఇంటా మహిళలు వారికీ పసుపు నీళ్లు తో స్వాగతం పలికి, బియ్యం, బెల్లం పసుపు కుంకుమలతో.. తమ కుటుంబాలకు రక్షణ, సుఖశాంతులు ఇచ్చే అమ్మవారిని ఆహ్వానించడం సంప్రదాయం. ఈ జేష్ఠమాస ఉత్సవాలు వచ్చే జూన్ నెల 15వ తేదీ గురువారం వరకు నిర్వహిస్తారు . (సవరణ: నిన్న జాతర రేపు సోమవారం అని వేసాము)
