సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్ర వరంలో తెలుగుదేశం పార్టీ ‘మహానాడు‘ కు ఏర్పాట్లులో భాగంగా నగరం అంతా పసుపురంగు జెండాలు, ఫెక్సీలు అలంకరణలతో సందడిగా మారింది. గోదావరి జిల్లాల నుండి విశేషంగా టీడీపీ క్యాడర్ హాజరు అవుతారని భావిస్తున్న ఈ మహానాడు ప్రాధాన్యత దృష్ట్యా టీడీపీ అధినేత చంద్రబాబు మూడ్రోజుల పాటు రాజమండ్రిలో బస చేయనున్నారు. రేపు సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు రాజమండ్రి చేరుకోనున్నారు. రేపు సాయంత్రం రాజమండ్రిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. హోటల్ మంజీరాలో జరిగే పొలిట్‌బ్యూరో సమావేశానికి చంద్రబాబు హాజరుకానున్నారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు హోటల్ మంజీరా నుంచీ వేమగిరిలో జరిగే మహానాడు ప్రాంగణానికి చంద్రబాబు బయల్దేరి వెళ్లనున్నారు. రాత్రి 8 గంటలకు మహానాడు వేదిక ఏర్పాట్లను పరిశీలించనున్నారు. ఈనెల 27, 28 తేదీల్లో జరిగే మహానాడులో చంద్రబాబు పాదయాత్రకు విరామం ఇచ్చి తనయుడు లోకేష్ పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *