సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నేడు, గురువారం ఉదయం 3 కోట్ల 69 లక్షల రూపాయలతో భీమవరం విస్సాకోడేరు లే ఔట్ జగనన్న కాలనీలో నిర్మిస్తున్న గ్రావెల్ రోడ్స్ కు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ శివరామ కృష్ణ తో పాటు ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణంలో ఉన్న గృహాల లబ్దిదారులు, వైసిపి నేతలు పాల్గొన్నారు. సీఎం జగన్ ఆదేశాల ప్రకారం పేదలకు గృహాల స్థలాలు ఇవ్వడమే కాదు వాటి నిర్మాణాలకు కావలసిన ఇసుక, సామాగ్రి కొనుగోలు కు ఆర్థిక సహకారం తో పాటు రోడ్డు డ్రైనేజి, మంచినీటి సౌకర్యాలతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని అతి త్వరలో ఇక్కడ నిర్మాణాలు పూర్తీ అవుతాయని భరోసా ఇచ్చారు. ఇప్పటికే సెంటు స్థలంలో చక్కగా నిర్మించిన గృహాన్నిసందర్శించి .. అందులో నివాసం ఉంటున్న కుటుంబీకులను అభినందించారు. అన్ని రకాలుగా ప్రభుత్వ పరిధిలో సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *