సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం రాజధాని అమరావతి లో 50 వేల మంది పేదలకు సెంటు చప్పున వెంకటపాలెంలో ఇంటిస్థలాల పంపిణి కార్యక్రమం లో సీఎం జగన్ పాల్గొన్నారు. లక్ష మంది పైగా హాజారు అయిన ఈ బహిరంగ సభలో స్థానిక మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్ సభలో మాట్లాడుతూ..‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు.చంద్రబాబు, పచ్చమీడియా, దత్త పుత్రుడు కలసి పేదలకు అమరావతిలో స్థలాలు రాకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించిన సరే.. అవ్వని అధిగమించి… పేదల కోసం సుప్రీం కోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. విజయం సాధించింది. ఇది పేదల విజయం .. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం ..అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అమరావతి ఇక మీద ‘సామాజిక అమరావతి’ అవుతుంది అన్నారు. ఈ రోజు 50,793మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం . సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లోమొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలుఇస్తున్నాం, మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని, ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వ సహకారంలో మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *