సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం: పట్టణంలోని స్థానిక మెంటే వారి తోటలోని సుందరయ్య భవనం లో ఈనెల 28వ తేదీ ఆదివారం పక్షవాతం, పిట్స్ బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని దీనిని అవసరమైన వారు వినియోగించుకోవాలని అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ వైద్య సేవా కేంద్రంనకు చెందిన వి.రాధాకృష్ణ, వసుధ ఫౌండేషన్ కన్వీనర్, ఇందుకూరి ప్రసాదరాజు లు కోరారు. విజయవాడ కు చెందిన డాక్టర్ గోపాలం శివన్నారాయణ క్యాంపు లో మన భీమవరంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ డి,సందీప్ వర్మ తదితరులు పాల్గొని వైద్య సేవలు అందిస్తారన్నారు. తక్కువ ధరలకే అవసరమైన ఔషధాలను నెలలవారీగా అందిస్తారన్నారు.వైద్య శిబిరంలకు వచ్చేవారు ముందురోజు బీపీ ,షుగర్ పరీక్షలను బయట చేయించుకుని ఆ రిపోర్టులు తీసుకొని మెడికల్ క్యాంపుకు రావాలన్నారు .అలాగే పాత రిపోర్ట్ లను ,వాడే మందులను కూడా తీసుకురావాలన్నారు క్యాంపు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందన్నారు సుందరయ్య భవనం లో రెగ్యులర్ గా అవుట్ పేషేంట్ విభాగమును నిర్వహిస్తున్నామన్నారు.
