సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు వేడుకలు నేడు, శనివారం రాజమండ్రిలో విశేషంగా హాజరు అయిన టీడీపీ క్యాడర్ సమక్షంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని, తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సాధువు రూపంలో వచ్చిన రావణుడు సీతను దొంగిలించినట్లు జగన్ ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను మోసం చేసాడని..అలాగే నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించారని విమర్శించారు. జగన్ పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని చంద్రబాబు పిలుపిచ్చారు. సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని అన్నారు. గత 4 ఏళ్లుగా కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీఅని.. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లల్లో రూ. 2.47 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, స్కాముల్లో జగన్ మాస్టర్ మైండ్ అని.. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని విమర్శించారు.ఇసుక లేకపోవడం వల్ల పనుల్లేక భవన నిర్మాణ కార్ముకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు.
