సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్నటివరకు దక్షిణాదిన బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రము కర్ణాటక లో కూడా అధికారం పోగొట్టుకున్నాక ఇక కేంద్ర ప్రభుత్వానికి దక్షిణాదిన అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీ అధినేత .. దేశంలో అతి బలమైన 4వ పార్టీ వైసిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మద్దతు తమకు కీలకం అన్న విషయం గుర్తించినట్లు ఉంది.. మొన్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభంలో సీఎం జగన్ కు ముందు వరుసలో ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రక్కన సిటు కేటాయించడం, ప్రధాని మోడీ , అమిత్ షాలు సీఎం జగన్ కు ఇచ్చిన ప్రాధాన్యం స్వష్టం అయ్యాయి. వచ్చే ఎన్నికలలో ఎన్డీయే లో వైసిపి భాగస్వామ్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. గతంలో పలుమారులు సీఎం జగన్ ప్రధాని మోడీ కి చేసిన విజ్ఞప్తులు ఇక వరుసగా ఫలిస్తున్నాయి. మొన్ననే.. రాష్ట్రానికి 9 ఏళ్ళ క్రితమే రావలసిన రావలసిన రెవెన్యూ లోటు 10వేల కోట్లు ఒక్కసారిగా విడుదల చేసిన కేంద్రం తాజాగా.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న ‘పోలవరం ప్రాజెక్టు కు ఏకంగా 12వేల కోట్ల నిధులు’ విడుదల చేసేందుకు సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు నేడు, శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో తాజాగా ప్రకటన చేశారు. త్వరలో రూ. 12వేల911 కోట్ల నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.. దీని వల్ల 41.15 ఎత్తులో నీటి నిల్వ చేసుకునేందుకు అవసరమైన నిధులను ఇవ్వనుందని, తొలిదశ పోలవరం నిర్మాణం, ఢయాఫ్రం వాల్ మరమ్మత్తుల నిమిత్తం రూ. 12,911 కోట్లను కేంద్రం ఇస్తుందన్నారు. దీనిపై త్వరలో కేంద్ర కెబినెట్లో నిర్ణయం తీసుకోబోతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *