సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత శుక్రవారం రాత్రి ఒడిశా లో ఒకేసారి జరిగిన 3 రైళ్లు ఢీకొన్న ఘోర రైలు ప్రమాదంలోతాజాగా నేడు, శనివారం మృతుల సంఖ్య 237కు చేరింది. రైలు ప్రమాదంలో సుమారు 900 మందికిపైగా తీవ్రగాయాలు అయ్యాయి. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బాలాసోర్‌లో గూడ్స్ రైలును కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పాయి. భారతదేశ రైల్వే చరిత్రలో ఎప్పుడు జరగని ఊహించని రీతిలో కోరమండల్ రైలు బోగీలపై యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ దూసుకెళ్లింది. ఘటనలో యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ 4 బోగీలు పట్టాలు తప్పాయి. అప్పుడే అటుగా వచ్చిన గూడ్స్ రైళ్లు పట్టాలపై బాధిత ప్రయాణికుల బోగీలపై తదుపరి దాడిగా దూసుకొనిపోవడంతో వారికీ మరింత గాయాలు అయ్యాయి. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలంలో 200 అంబులెన్స్‌లు సహాయక చర్యలు అందిస్తున్నాయి. రైలు ప్రమాద ఘటనతో రైల్వే శాఖ 18 రైళ్లను రద్దు చేసింది. రైలు ప్రమాదంలో చనిపోయినవారికి రైల్వేశాఖ మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించనున్నట్టు తెలిపింది. ఇక తీవ్రంగా గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందించనుంది.
