సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశాన్ని కుదిపేసిన ఒరిస్సా లోని బాలాసోర్ రైలు దుర్ఘటన మరువక ముందే దేశంలో వరుస రైలు ప్రమాదాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒరిసా లోనే మరో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన బార్‌ఘర్ జిల్లాలో బర్గర్‌లో సున్నపురాయిని తీసుకెళ్తున్న గూడ్స్ రైలుకు చెందిన 5 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో నేడు సోమవారం తెల్లవారుజామున మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. రైలు తిరుపతి వెళ్తుండగా బోగీల్లోకి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే చైన్‌ లాగి రైలును ఆపేసి హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. లూబ్రికెంట్ అయిపోవడంతో చక్రాల రాపిడితో మంటలు వ్యాపించినట్టు గుర్తించారు. పెను ప్రమాదం తప్పిపోయిన ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *