సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం జరిగిన నేపథ్యంలో తెలం గాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందంటూ వస్తున్న వార్తలు ప్రచారం లో నిజం లేదని అవి ఊహాగానాలేనని, వాటిని పట్టించుకోవాల్సి న అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆ సమావేశం కు ప్రాధాన్యం లేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పే ముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధాని మోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్తలు ఇటువంటి వార్తలు పట్టించుకోకుండా తెలంగాణాలో కెసిఆర్ కుటుంబాన్ని అధికారంలో నుంచి దించి బీజేపీ గెలుపే లక్ష్యం గా పనిచేయాలని .. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *