సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రభాస్ శ్రీరామునిగా.. బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా గా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చినజీయర్ స్వామి ముఖ్య అతిధిగా హిందూ ఆధ్యాత్మిక మేళవింపు తో తిరుమల ఏడుకొండల సన్నిధిలో జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్…నినాదాలు, కాషాయ జెండాల రెపరెపలు మధ్య ఘనంగా నిర్వహించారు. సినిమా యూనిట్ కు సంబందించిన అందరు వేదికపై హీరో ప్రభాస్ తో సైతం చెప్పులు కూడా ధరించకుండా శ్వేతా వస్త్రాలతో సాంప్రదాయ వస్త్ర ధారణ తో వేదికపై కి వస్తే.. మహా సాధ్వి సీత పాత్ర ధరించిన కృతి సనన్ పాదాలకు చెప్పులయితే ధరించలేదు, నిండుగా దుస్తులు ధరించింది మంచిదే.. కానీ హిందూ సాంప్రదాయ పద్ధతులకు విరుద్ధంగా వేడుకలో నల్లని చీర ( శ్రీరాముని అడవులకు పంపమని దశరధుని కోరేందుకు నిరసనగా కైకేయి నల్ల చీర కట్టుకొంది ) ధరించింది. హిందూ మహిళకు , ఆడపిల్లలకు తరతరాల సంప్రదాయంగా వస్తున్నా నుదుట బొట్టు కానీ, గాజులు కానీ ధరించలేదు. ఎవరి సంప్రదాయం పాటించింది?ఇదేమి ఫ్యాషన్ ? కృతి సనమ్ వ్యక్తిగతంగా ఎలా ఉన్న అభ్యన్తరం లేదు కానీ పవిత్ర రామాయణం లో సీత నాయకి పాత్ర పోషిస్తూ ఆదిపురుష్ వేదికపై చూసే వారికి గౌరవమైన భావన కలగాలి కానీ.. ఇలా కనిపించడం మాత్రం చాల ఇబ్బందికరేమే.. ఆమెకు నిర్వాహకులు డ్రెస్ కోడ్ ఏమి చెప్పలేదా? చెప్పిన ఆమె వినలేదా? మరి ఈమె సీత తత్వాన్ని అర్ధం చేసుకొందా?ఆమె పాత్రలో ఎలా నటించిందో? వెండితెరమీద చూడవలసిందే..
